నడిరోడ్డుపై బాలకృష్ణ విశ్వరూపం..షాక్ లో టీడీపీ
ఎన్నో సార్లు బహిరంగంగా కార్యకర్తలపై చేయిచేసుకుని వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణ మరోసారి నడిరోడ్డుపై బెదిరింపులకు దిగారు. ఓ ఛానల్ కెమెరామెన్ ను బెదిరించి షూట్ చేసిన వీడియో డిలీట్ చేసే వరకూ బెదిరింపులకు దిగారు. అంతే కాదు..తీవ్రమైన పరుష పదాలతో ...రాయకూడని భాషలో బూతులు తిట్టారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తరుణంలో బాలకృష్ణ ఇలాంటి చర్యలకు పాల్పడటం టీడీపీ నేతలను షాక్ కు గురిచేసింది. ఈ పరిణామాలు అంతిమంగా పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయంతో పార్టీ నేతలు ఉన్నారు. అయినా సరే సీఎం చంద్రబాబు మొదలుకుని ఎవరూ ఆయన చెప్పే సాహసం చేసే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా హిందూపురంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా బాలయ్య తీవ్ర దుమారానికి కేంద్ర బిందువుగా మారారు.
ఒక మీడియా ప్రతినిధిపై రౌడీయిజం ప్రదర్శించారు. ‘ప్రాణాలు తీస్తా’ అంటూ ఒంటికాలిపై లేచారు. బాలకృష్ణ వస్తున్నప్పుడు చిన్నపిల్లలను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది పక్కకు లాగేశారు. ఈ వ్యవహారాన్ని షూట్ చేసిన మీడియా ప్రతినిధిపై దౌర్జన్యం చేసి, రాయకూడని భాషలో బూతులు తిట్టారు. కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాలని చేయి చేసుకున్నారు. ‘రాస్కెల్ మా బతుకు మీ చేతుల్లో ఉన్నాయిరా. నరికి పోగులు పెడతాను, ప్రాణాలు తీస్తాను. బాంబులు వేయడం కూడా తెల్సు నాకు. కత్తి తిప్పడం కూడా తెల్సు’ అంటూ బాలయ్య బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో రికార్డు అయ్యాయి. మీడియా ప్రతినిధిపై బాలకృష్ణ దౌర్జన్యాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.
https://www.youtube.com/watch?v=W7x9RhJta-w