Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ కొత్త సినిమా

అల్లు అర్జున్ కొత్త సినిమా
X

తాజాగా కొంత గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూకుడు పెంచారు. వరస పెట్టి సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. ఓ వైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా రెడీ కావాల్సి ఉండగానే...గతంలో తనకు పలు హిట్స్ ఇఛ్చిన సుకుమార్ తో మరో సినిమాకు ఓకే చెప్పేశాడు ఈ స్టైలిష్ హీరో. బన్నీ, సుక్కూ ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. మహాశివరాత్రి స్పెషల్‌గా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీస్‌ బ్యానర్ పై సినిమా నిర్మించనున్నారు. ఈ సినిమా ‘ఆర్య’ సిరీస్‌కు సీక్వెల్‌గా ‘ఆర్య 3’ అవుతుందా? లేక కొత్త కథతో వస్తారా? అన్న టెన్షన్ అభిమానుల్లో ఉంది.

Next Story
Share it