Telugu Gateway
Andhra Pradesh

ఏపీ బడ్జెట్ దీ అదే దారి

ఏపీ బడ్జెట్ దీ అదే దారి
X

అందరిదీ ఎన్నికల బాటే. ఏపీ బడ్జెట్ లోనూ ఎన్నికలే లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోంది. వచ్చే ఎన్నికల్లో రైతులను ఆకట్టుకునేందుకు వీలుగా పెట్టుబడి రాయితీ కింద ఇఛ్చేందుకు2019-20 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో 5000 కోట్ల రూపాయల కేటాయింపులు చూపారు. కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏటా ఆరు వేల రూపాయల ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతు బంధు’ పథకం రాజకీయంగా సూపర్ సక్సెస్ కావటంతో అందరూ అదే బాట పట్టారు. ఏపీ సర్కారు తాము పెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అని చెబుతున్నా..శాఖల వారీగా పూర్తి స్థాయి బడ్జెట్ తరహాలోనే కేటాయింపులు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11వ బడ్జెట్ ను ప్రవేశపెట్టడం నాకు గర్వకారణం అని పేర్కొన్నారు. ‘చారిత్రాత్మకమైన రాజధాని నగరం ‘మన అమరావతి’. ఈ అమరావతిలో వరుసగా 3వబడ్జెట్ పెట్డడం గర్వకారణం. నాలుగున్నరేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. సవాళ్లను అధిగమించిన తీరు గుర్తు చేసుకుందాం. హేతుబద్దత లేకుండా రాష్ట్రవిభజన జరిగింది. దీనివల్ల రాజధాని నగరాన్ని కోల్పోయాం. ఆదాయ-వ్యయాలను సరిగా పంచలేదు. ఆస్తులు-అప్పులను సరిగా పంపిణీ చేయలేదు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా నిరాశా నిస్పృహలు. అపార అనుభవం గల నాయకత్వాన్ని ప్రజలు ఆశించారు. ఆ నమ్మకంతోనే చంద్రబాబుకు అధికారం అప్పగించారు. ప్రజలంతా తమ నమ్మకాన్ని,ఆశలను ఉంచారు.’ అని వ్యాఖ్యానించారు.

ఏపీ బడ్జెట్ హైలెట్స్

2019-20 బడ్జెట్ అంచనా రూ.2,26,177.53 కోట్లు.

రెవెన్యూ వ్యయం రూ.1,80,369.33 కోట్లు.

క్యాపిటల్ వ్యయం రూ.29,596.33 కోట్లు.

రెవెన్యూ మిగులు రూ.2099.47 కోట్లు.

ఆర్థిక లోటు రూ.32,390.68 కోట్లుగా అంచనా.

అన్నదాత సుఖీభవ పథాకానికి రూ.5వేల కోట్లు.

నిరుద్యోగ భృతిని రూ. వెయ్యి నుంచి రూ.2 వేలకు పెంపు.

వ్యవసాయ రంగానికి రూ.12,732.97 కోట్లు

వైద్య రంగానికి రూ.10032.15 కోట్లు

పర్యావరణం-అటవీ శాఖకు రూ.491.93 కోట్లు

పౌరసరఫరాలకు రూ.3763.42 కోట్లు

ఇరిగేషన్ కు రూ.16,852.27 కోట్లు

ఉన్నత విద్యకు రూ.3171.63 కోట్లు

హోం శాఖకు రూ.6397.94 కోట్లు

గృహ నిర్మాణ రంగానికి అదనంగా రూ.500 కోట్లు

ఎంఎస్ ఎంఈ పరిశ్రమలకు రూ.400 కోట్లు

క్షత్రియ కార్పొరేషన్ కు రూ.50 కోట్లు

బీసీల కోసం 11 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు

గృహ నిర్మాణానికి రూ.479 కోట్లు

సంక్షేమ పథకాలకు రూ.65,486 కోట్లు

న్యాయ శాఖకు రూ.918.81 కోట్లు

మునిసిపాలిటీ, పట్టణాభివృద్ధికి రూ.7979.34 కోట్లు

పరిశ్రమల శాఖకు రూ.4,114.92 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ.1,308.73 కోట్లు

ఐటీ రంగానికి రూ.1,006.81 కోట్లు

కార్మిక ఉపాధి శాఖకు రూ.1265.75 కోట్లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.35,182.61 కోట్లు

స్కిల్ డెవలప్ మెంట్ కోసం రూ.458.66 కోట్లు

ధరల స్థిరీకరణకు రూ. వెయ్యి కోట్లు.

Next Story
Share it