Telugu Gateway
Politics

ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ

ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ
X

ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ముఖ్యంగా ఆ ‘50 లక్షలు’ ఎక్కడ నుంచి వచ్చాయి..ఎవరు ఇచ్చారు అనే కోణంలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ విచారణ ప్రారంభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓట్ల కొనుగోలులో భాగంగా టీడీపీ తరపున బరిలో నిలిచిన వేం నరేందర్ రెడ్డి కోసం రేవంత్ రెడ్డి అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు డబ్బులిచ్చిన విషయం తెలిసిందే. మొత్తం డీల్ ఐదు కోట్లకు మాట్లాడుకుని..తొలి దశలో 50 లక్షలు ఇచ్చారు. వీడియో సాక్షిగా ఇదంతా రికార్డు అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన విచారణ మళ్లీ ఈడీ రంగంలోకి ప్రవేశించటంతో ఊపందుకున్నట్లు అయింది.

అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారుల్నీ ఈడీ అధికారులు మంగళవారం ఏడున్నర గంటల పాటు విచారించారు. ఈ నెల 18న ఉదయ్‌సింహ, 19న రేవంత్‌రెడ్డిలను విచారించనున్నారు. అయితే తన కుమారులను వేధిచంటంపై వేం నరేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును తాము రాజకీయంగా ఎదుర్కొంటామని...దీంతో ఎలాంటి సంబంధం లేని తన కుమారులను ఇందులోకి లాగటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.

Next Story
Share it