Top
Telugu Gateway

కెసీఆర్ కేబినెట్ లోకి కొత్తగా పది మంది

కెసీఆర్ కేబినెట్ లోకి కొత్తగా పది మంది
X

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం అయింది. కొత్తగా సీఎం కెసీఆర్ కేబినెట్ లో పది మంది మంత్రులు చేరనున్నారు. ప్రస్తుతం సీఎంతో పాటు హోం మంత్రి మహమూద్ అలీ మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11.30 గంటలకు జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పులు ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాసగౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సి. మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కొత్త మంత్రులకు సమాచారం అందజేశారు.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన 65 రోజుల తర్వాత విస్తరణ జరుగుతోంది. మిగిలిన ఖాళీలను పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మంత్రివర్గ విస్తరణలో కెసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కెటీఆర్ తోపాటు, మరో మాజీ మంత్రి, కెసీఆర్ మేనల్లుడు హరీష్ రావులను దూరం పెట్టారు. దీంతో హరీష్ రావును ఎంపీగా పోటీ చేయించటం పక్కా అని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it