Telugu Gateway
Telangana

కెసీఆర్ ‘రికార్డు’ బడ్జెట్

కెసీఆర్ ‘రికార్డు’ బడ్జెట్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కొత్త రికార్డు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా నమోదు అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రులే బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి, కొణిజేటి రోశయ్యలు. వారి తర్వాత ఈ రికార్డు కెసీఆర్ పేరిట నమోదు కానుంది. మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ సీఎం కెసీఆర్ తన వద్దే అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం శాసనసభలో కెసీఆర్ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది ఆరవ బడ్జెట్‌ అని పేర్కొన్న కేసీఆర్‌ స‍్వల్పకాలంలోనే పురోగతి సాధించామన్నారు.

దేశవ్యాప్తంగా తెలంగాణను రోల్‌ మోడల్‌గా చూస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని కుటుంబమే లేదన్నారు. అందుకే అత్యధిక మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను రెండోసారి గెలిపించారని కేసీఆర్‌ పేర్కొన్నారు. 2018-19లో తెలంగాణ వృద్ధిరేటు 10.6 శాతంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్ల పధకం తన హృదయానికి దగ్గరైనదని అన్నారు. బడ్జెట్‌ సందర్భంగా ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు. శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

తెలంగాణ బడ్జెట్‌ హైలెట్స్

2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

రెవెన్యూ వ్యయం రూ. 1,31,629 కోట్లు

మూలధన వ్యయం రూ. 32,815 కోట్లు

రెవెన్యూ మిగులు రూ. 6,564 కోట్లు

ఆర్థిక లోటు రూ. 27,749 కోట్లు ఉంటుందని అంచనా

ఆసరా పెన్షన్లు వెయ్యి నుంచి రూ.2016కు పెంపు

ఆసరా పింఛన్ల కోసం రూ. 12,067 కోట్లు

దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు

దీని కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయింపు

పెన్షన్‌ వయసు 60 నుంచి 57 ఏళ్లకు తగ్గింపు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 1450 కోట్లు

నిరుద్యోగుల భృతి రూ.3016 (దీని కోసం విధివిధానాలను రూపకల్పన)

నిరుద్యోగ భృతి కోసం రూ. 1,810 కోట్లు

రైతుబంధు పథకానికి ఎకరానికి ఏడాదికి రూ.8 నుంచి రూ.10వేలు పెంపు

దీని కోసం బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు కేటాయింపు

వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు కేటాయింపు

రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల కోట్లు

రైతు బీమా కోసం రూ. 650 కోట్లు

బియ్యం రాయితీ కోసం రూ. 2,744 కోట్లు

షెడ్యూలు కులాల ప్రగతి నిధి కోసం రూ. 16,581 కోట్లు

మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2004 కోట్లు

ఎంబీసీ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్లు

మిషన్‌ కాకతీయకు రూ.22,500 కేట్లు

బీసీలకు మారో 119 రెసిడెన్షియల్‌ స్కూళ్లు

​​​​​​​పంచాయతీలకు 2 ఫైనాన్స్‌ కమిషన్ల కింద రూ.3,256 కోట్లు

ఒక్కో మనిషికి రూ.1606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు

500 జనాభా కలిగిన గ్రామానికి రూ.8 లక్షల నిధులు

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ.1,41 లక్షల కోట్లు పెట్టుబడులు

టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 8,419 పరిశ్రమలకు అనుమతులు

పరిశ్రమల ద్వారా 8.58 లక్షల ఉద్యోగాలు భర్తీ

ఏప్రిల్‌ చివరినాటికి మిషన్‌ భగీరధ పనులు పూర్తి

మరో రెండు నెలల్లో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీరు

Next Story
Share it