Telugu Gateway
Politics

చింతమనేనిపై ఎంపీ ఫైర్

చింతమనేనిపై ఎంపీ ఫైర్
X

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై అమలాపురం ఎంపీ రవీంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తాజాగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే చింతమనేని రాజకీయంగా సమాధికాక తప్పదని హెచ్చరించారు.

దళితులు రాజకీయాలకు పనికిరారంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘నోటి దురసు, కుల గజ్జితో మాట్లాడుతున్నావ్‌. అంబేద్కర్‌ భిక్ష వల్లే నువ్ ఎమ్మెల్యేగా తిరుగుతున్నావ్‌. దళితులపట్ల పిచ్చి కూతలు మానుకోకపోతే రాజకీయంగా సమాధికాక తప్పదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

Next Story
Share it