Telugu Gateway
Cinema

ఇమ్రాన్...మరి మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావ్

ఇమ్రాన్...మరి మూడు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నావ్
X

రామ్ గోపాల్ వర్మ పంచ్ ఇది. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై వర్మ తనదైన స్టైల్ లో ట్విట్టర్ వేదికగా ‘పంచ్ లు’ ఇచ్చారు వర్మ. ‘మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని నమ్మినప్పుడు ..మూడుసార్లు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో’ అంటూ ప్రశ్నించారు. అంతే కాదు..'ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్‌ తో మా వైపు పరిగెత్తుకొస్తున్నపుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మూగ భారతీయులకు కొంచెం మీ జ్ఞానాన్ని పంచండి. ఊరికే ఏమీ వద్దు. భారతీయులందరం మీకు, మీ ట్యూషన్‌ టీచర్‌కు ఫీజు చెల్లిస్తాము. మీ దేశంలో ఎవరు(ఒసామా బిన్‌లాడెన్‌) నివసిస్తున్నారనేది అమెరికాకు తెలుస్తుంది. కానీ, మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారనేది మీకు తెలియదు. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఏదో మూగ భారతీయున్ని అడుగుతున్నాను సర్‌.

దయచేసి నన్ను కొంచెం ఎడ్యుకేట్‌ చేయండి సర్‌. ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరూ చెప్పలేదు, కానీ మీరు కూడా వాటిపై ప్రేమ లేదనే విషయాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, తాలిబన్, ఆల్ ఖైదాలను మీరు బంతులుగా భావించి, పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్‌లోకి కొడుతున్నారు, కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివి తేటలు నేర్పండి సర్‌' అని రామ్‌గోపాల్‌ వర్మ ఇమ్రాన్ పై వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

Next Story
Share it