Telugu Gateway
Cinema

ఒరిజినల్ కంటే ఒరిజినలా ఉన్నావ్ రానా

ఒరిజినల్ కంటే ఒరిజినలా ఉన్నావ్ రానా
X

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా దూకుడు మీద ఉన్నారు. గురువారం ఉదయమే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తనదైన ‘పంచ్’లతో ఎటాక్ చేశారు. ఆ తర్వాత లక్ష్మీస్ ఎన్టీఆర్ పై చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలకృష్ణ నటించి..నిర్మించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగం మహానాయకుడిలో చంద్రబాబు పాత్ర పోషించిన రానా దగ్గుబాటి రానాను టార్గెట్ చేశారు. ‘హే రానా చంపేస్తున్నాం. ఒరిజినల్ కంటే ఒరిజనలా కన్పిస్తున్నావు అంటూ ట్వీట్ చేశారు.

ఈ సినిమాలో దగ్గుబాటి రానా చంద్రబాబునాయుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే రానా మాత్రం వర్మతో ఎందుకు అనుకున్నారో ఏమో కానీ..కాలా కూల్ గా ట్విట్టర్ లో థ్యాంక్యూ అని పెట్టి వదిలేశారు తప్ప...ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మహానాయకుడు సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో అసలు చంద్రబాబును ఎలా చూపించారు..సినిమా ముగింపు ఎలా ఉంటుంది అన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Next Story
Share it