Telugu Gateway
Cinema

చంద్రబాబు భయపడ్డారు

చంద్రబాబు భయపడ్డారు
X

ఇది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పేరు ప్రస్తావించకుండానే గురువారం నాడు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సినిమా అంశాన్ని ప్రస్తావించారు. కొంత మంది ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దీనిపై వర్మ వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్’ పై చంద్రబాబు భయపడ్డారు అంటూ ట్వీట్ చేశారు. దీనికి తోడుగా ఓ స్వల్ప నిడివి గల వీడియోను కూడా పోస్ట్ చేశారు.

మొత్తానికి బాలకృష్ణ సినిమా కంటే వర్మ సినిమానే వార్తల్లో ట్రెండింగ్ లో నిలుస్తోంది. ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మీద వచ్చే రకరకాల రియాక్షన్స్‌ కు మీ నుండి వచ్చే రియాక్షన్‌ ఏంటి సార్‌’ అని జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఎన్టీఆర్ మహా నాయకుడు సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రలో నటిస్తున్న రానా ‘మీరేమన్నా సరే రియాక్ట్ కావొద్దు, ఏమన్నా సరే’ అని ఆవేశంగా చెప్పే డైలాగ్‌ను జోడించి వీడియో రిలీజ్ చేశాడు.

Next Story
Share it