Telugu Gateway
Cinema

రామ్ చరణ్ సంచలన ప్రకటన

రామ్ చరణ్ సంచలన ప్రకటన
X

సహజంగా టాప్ హీరోలు తమ సినిమా హిట్ అయినా..ఫట్ అయినా పెద్దగా బహిరంగ ప్రకటనలు ఇవ్వరు. టాలీవుడ్ లో ఇప్పటివరకూ అలాంటి సంప్రదాయం లేదు. ఏది ఉన్నా కూడా నిర్మాణ సంస్థలే హడావుడి చేస్తూ ఉంటాయి. అందుకు భిన్నంగా ఈ సారి మెగా హీరో రామ్ చరణ్ మంగళవారం నాడు ఓ ప్రకటన విడుదల చేశారు. అది కూడా వినయ విధేయ రామ సినిమా ఫలితానికి సంబంధించినది కావటం విశేషం. మాస్‌ యాక్షన్‌ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వినయ విధేయ రామ అన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌ తరువాత చెర్రీ రొటీన్‌ మాస్‌ ఫార్ములా సినిమా చేయటం అభిమానులకు రుచించలేదు.

మాస్‌ ఫార్ములా సినిమా కావటంతో కలెక్షన్లు మాత్రం భారీగానే వచ్చాయి. వినయ విధేయ రామ రిజల్ట్‌ పై చరణ్‌ ఓ ప్రతికా ప్రకటన విడుదల చేశారు. సినిమా కోసం పనిచేసిన సాకేంతిక నిపుణులందరికి కృతజ్ఞతలు. పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతజ్ణుడినై ఉంటానని తెలిపారు. అభిమానులను అలరించే సినిమా ఇచ్చేందుకు శ్రమించామన్న రామ్ చరణ్ అంచనాలని అందుకోలేకపోయామని అంగీకరించారు. మీరు చూపించే ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకుని భవిష్యత్ లో మీరు మెచ్చే సినిమాలు చేయటానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.

Next Story
Share it