Telugu Gateway
Cinema

‘ప్రేమికుల రోజు’పై రకుల్ కామెంట్

‘ప్రేమికుల రోజు’పై రకుల్ కామెంట్
X

ప్రస్తుతం యూత్ లో అంతా ప్రేమికుల రోజు ఫీవరే. దీన్ని సెలబ్రేట్ చేసుకునేవారు ఉన్నారు. వ్యతిరేకించే వాళ్లు ఉన్నారు. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమికుల రోజుపై స్పందించారు. ఆమె ఏమన్నారో చూడండి. ‘ప్రేమికుల దినోత్సవం అనేది విదేశీ సంస్కృతి. అందుకే నాకు నమ్మకం లేదు. అయినా ప్రేమకు ఒక్క రోజు కేటాయించడం ఏంటి? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి? ఇది కమర్షియల్‌గా వర్కౌట్‌ అవుతుంది. ఒక్కరోజులో ప్రేమ వస్తుందనుకోను. ప్రేమ అన్నది లవర్‌తో, జీవిత భాగస్వామితో మాత్రమే కాదు. తల్లితండ్రులు, సోదరులు, సోదరీమణులు, ఫ్రెండ్స్‌.. ఇలా అందరిదీ ప్రేమే కదా.’అని వ్యాఖ్యానించారు. రకుల్ హీరోయిన్ గా నటించిన దేవ్ సినిమా విశేషాలు చెప్పేందుకు ఆమె మీడియా ముందుకు వచ్చారు.

ఈ ప్రేమికుల రోజుకి ప్రత్యేకం అంటూ ఏం లేదు. తొలిసారి మా అమ్మానాన్నలు, ఫ్యామిలీతో కలిసి ప్రేమికుల రోజున (గురువారం) నేను నటించిన ‘దేవ్‌’ సినిమాను హైదరాబాద్‌లో చూడబోతున్నా. అదే ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం’’ అని పేర్కొన్నారు. నిజ జీవితంలో సాహసాలను ఇష్టపడతా. ఇటీవల దుబాయ్‌లో 15వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్‌ చేశా. విమానంలోనుంచి దూకేశాక ప్యారాచూట్‌ ఓపెన్‌ కాకుంటే పరిస్థితి ఏంటి? బతుకుతామా? లేదా? చాలా సినిమాలు ఒప్పుకున్నా అనిపించింది. స్కై డైవింగ్‌ విషయం ముందే ఇంట్లో చెబితే అమ్మానాన్నలు భయపడతారని చెప్పలేదు. విషయం చెప్పి, వీడియో పోస్ట్‌ చేశా. తెలుగులో చేస్తున్న ‘వెంకీమామ’ సినిమా షూటింగ్‌ ఈ వారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నావి ఐదారు సినిమాలు రిలీజవుతాయి అని తెలిపారు.

Next Story
Share it