మెట్ల మార్గంలో తిరుమలకు రాహుల్
BY Telugu Gateway22 Feb 2019 9:46 AM GMT

X
Telugu Gateway22 Feb 2019 9:46 AM GMT
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి ఏపీ వేదికగా ప్రత్యేక హోదాపై హామీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో నిర్వహించనున్న ప్రత్యేక హోదా భరోసా యాత్ర ముగింపు సభలో పాల్గొననున్నారు. అంతకు ముందు ఆయన మెట్ల మార్గంలో తిరుమల చేరుకున్నారు. రెండు గంటల్లో రాహుల్ తిరుమల వెళ్ళారు. రాహుల్ పదేళ్ల తర్వాత తిరుమల వచ్చారు. ఆయన సహచర భక్తులను పలకరిస్తూ ముందుకు సాగారు. రాహుల్ శ్రీవారిని దర్శించుకోనున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ ప్రకటించింది. 2014 ఎన్నికల సమయంలో మోదీ సభ నిర్వహించిన ప్రాంగణంలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సభ తలపెట్టడం గమనార్హం.
Next Story