Telugu Gateway
Andhra Pradesh

పది లక్షలకు ఓ మొక్క.. అమరావతిలో షాకిచ్చే మొక్కల స్కామ్ ఇది!

పది లక్షలకు ఓ మొక్క.. అమరావతిలో షాకిచ్చే మొక్కల స్కామ్ ఇది!
X

ఒక్కో మొక్క ధర 7, 5, 3.5, 2.5 లక్షలుగా నిర్ధారణ

ఐదు కోట్లతో 3970 మొక్కల కొనుగోలుకు నిర్ణయం

షాక్ కు గురయ్యారా?. ఈ ఒక్క మొక్కతోనే మీకు షాక్ లు ఆగవు. మామూలుగా అయితే మనకు షాక్ కొట్టాలంటే విద్యుత్ కావాలి. కానీ ఎలాంటి విద్యుత్ లేకుండా కూడా కేవలం మొక్కలతో కూడా షాక్ ఇవ్వొచ్చు అని అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏడీసీ) తేల్చిపడేసింది. అసలు అమరావతి కోసం దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మొక్క కొనుగోలు చేసి ఏమి చేస్తారు? ఇదొక్కటే కాదు..ఆలివ్ మల్టీ బ్రాంచెస్ మొక్కలను కూడా ఒక్కో మొక్కను 1.60 లక్షల రూపాయలతో కొనుగోలు చేయనున్నారు. ఆ రేటుతో పది మొక్కలు కొంటారట. పెద్ద ఆవివ్ మొక్కలను ఒక్కోటీ 7.80 లక్షల రూపాయలతో కొనుగోలు చేయనున్నారు. అదే ధరకు నాలుగు మొక్కలు కొంటారు. ఇలా చెప్పుకుంటే పోతే రకరకాల మొక్కల రేట్లు 80 వేలు.32 వేలు, 3.20 లక్షలు, 96 వేలు, 1.50 లక్షల ధరతో ఒక్కో మొక్క కొంటారట. 2019 సంవత్సరంలో ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో వేసేందుకు మొత్తం 5.10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3970 మొక్కలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.

ఈ మొక్కల ధరలను కమిటీ ఖరారు చేసింది. ఈ లెక్కన ఒక్కో మొక్కకు సగటు ధర సుమారు 12000 రూపాయలపైనే పడుతుంది. అసలు ఒక్కో మొక్కను పది లక్షలు..ఐదు లక్షల రూపాయలుపెట్టి కొనుగోలు చేయటం ఏమిటో అర్థం కావటంలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. పోనీ అమరావతిలో శాశ్వత రాజధాని భవనాలు అన్నీ పూర్తయ్యాయి..అందుకే ఇంత హడావుడి చేస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక్క సచివాలయం పనులు మాత్రమే ప్రారంభం కాగా..మిగిలిన భవనాల పనులు ప్రాధమిక దశకు కూడా చేరుకోలేదు.

ఇఫ్పటికే అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో జరిగే మొక్కల స్కామ్ లను చూసి ఉద్యోగులు పరార్ అవుతున్నాయి. అయినా సరే ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్ధసారధి మాత్రం ఏ మాత్రం వెనకడుగు వేయటం లేదు. గతంలో కూడా కేవలం 500 రూపాయలకు దొరికే మొక్కలను వేలకు వేలు పోసి కొనుగోలు చేసి ప్రజల సొమ్మును కాజేశారు. ఇఫ్పుడు మరోసారి అలాంటి ప్లాన్ తోనే ఈ టెండర్ డిజైన్ చేశారని చెబుతున్నారు. ఒక్కో మొక్క రేటును పది లక్షలు..ఐదు లక్షలు..మూడు లక్షలు పెట్టి కొనటం ఏమిటని అధికారులు కూడా నివ్వెరపోతున్నారు.

Next Story
Share it