Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా మొదలైంది

నాని కొత్త సినిమా మొదలైంది
X

ఓ వైపు జెర్సీ సినిమా తుది దశలో ఉండగానే హీరో నాని కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు. ఇది నాని 24వ సినిమా. సోమవారం నాడు కొత్త సినిమా పూజా కార్యక్రమం వేడుకగా జరిగింది. మంగళవారం నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Next Story
Share it