Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా రెడీ

నాని కొత్త సినిమా రెడీ
X

వరస హిట్లకు కొంత బ్రేక్ వచ్చినా..నాని మాత్రం వరస పెట్టి సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ హీరో కొత్త సినిమా ‘జెర్సీ’ విడుదలకు రెడీ అవుతోంది. అంతే కాదు..ప్రేమికుల దినోత్సవం రోజున సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాధ్ నటించారు. ‘మళ్ళీ రావా’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. వాలంటైన్స్ డే రోజున ‘‘అదేంటోగానీ ఉన్న పాటుగా’ అంటూ సాగే సాంగ్‌ని రిలీజ్‌ చేస్తున్నాం. 14 నుంచి పాటలోని మ్యాజిక్‌ని ఫీల్‌ అవ్వండి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందిస్తున్నారు.

Next Story
Share it