Telugu Gateway
Politics

విపక్షాలకు ములాయం ఝలక్

విపక్షాలకు ములాయం ఝలక్
X

ప్రధాని మోడీపై ఉమ్మడిగా పోరాడాలని చూస్తున్న విపక్షాలకు సమాజ్ వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. ఇంత కాలం మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన సడన్ గా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. అంతే కాదు..మళ్లీ మోడీనే ప్రధాని అవుతారని చెప్పారు. మోడీ అందరినీ కలుపుకుని పోతున్నారని..ఆయన అన్ని పనులు చేయగల సమర్థుడు అని పేర్కొనటంతో విపక్షాలకు షాక్ ఇఛ్చినట్లు అయింది. బుధవారం నాడు ములాయం పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.

ఆ సమయంలో సభలోనే ఉన్న మోదీ ములాయం వ్యాఖ్యలకు చిరునవ్వులు చిందించారు. ఓ వైపు ఉత్తరప్రదేశ్‌లో ములాయం కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి బీఎస్పీతో సైతం అఖిలేశ్‌ జత కట్టారు. ప్రస్తుతం ములాయం ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీలో విభేదాలు తలెత్తినప్పటి నుంచి అఖిలేశ్‌, ములాయం మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే.

Next Story
Share it