Telugu Gateway
Politics

రాహుల్ పరీక్ష తప్పిన విద్యార్ధి

రాహుల్ పరీక్ష తప్పిన విద్యార్ధి
X

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్టీ వెరైటీ విమర్శలు చేశారు. అదేంటి అంటే ప్రధాని నరేంద్రమోడీ క్లాస్ టాపర్ గా ఉంటే..రాహుల్ గాంధీ ఫెయిలైన విద్యార్ధిగా నిలిచారంట. ప్రధానిపై వ్యక్తిగత ద్వేషంతోనే కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ రఫేల్‌ ఒప్పందంలో అక్రమాలు అంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రక్షణ బలగాలు, న్యాయవ్యవస్థ, ఆర్బీఐ వంటి వ్యవస్థలపై కాంగ్రెస్‌ బూటకపు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వ్యవస్ధలను కాపాడతామంటూ ముందుకొస్తున్న విధ్వంసకుల నుంచి వాటిని కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని జైట్లీ పేర్కొన్నారు.

ఆర్ బిఐ, న్యాయవ్యవస్ధ, సీబీఐల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు గతంలో ఎంతలా తలదూర్చాయో తెలుసుకోవాలని జైట్లీ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ లో కాంగ్రెస్‌కు చురకలు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష నేతలు మొసలికన్నీరు కారుస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని తిరిగి వారసత్వ నేతల చేతిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Next Story
Share it