మార్చి22న లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్నో సంచలనాలకు కేంద్రమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు రంగం సిద్దం అయింది. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకుంటున్న ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులకు సంబంధించిన ప్రచారంలో ఉన్న వార్తలన్ని పుకార్లని చిత్రయూనిట్ కొట్టిపారేశారు.
అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా మార్చి 22న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇప్పటికే రిలీజ్ అయిన లక్ష్మీస్ ఎన్టీఆర్ థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ రావటంతో సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఓ వైపు ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడు నందమూరి బాలక్రిష్ణ తెరకెక్కించగా..రెండు భాగాలూ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూశాయి. దీంతో అందరి ఫోకస్ వర్మ సినిమాపైనే ఉంది.