Telugu Gateway
Politics

ఏపీలో గెలుపు వైసీపీదే

ఏపీలో గెలుపు వైసీపీదే
X

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో గెలుపు ప్రతిపక్ష వైసీపీదే అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ ) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తన వైఫల్యాలతోనే ఓడిపోబోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాబోయే రోజుల్లో ఢిల్లీలో కాదు కదా..విజయవాడలోనూ చంద్రబాబు చక్రం తిరగదని ఎద్దేవా చేశారు. ఏపీకి తాము చేసిన అన్యాయం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలతో ఏపీ ప్రజలను నానా ఇబ్బందులు పెట్టింది చంద్రబాబు సర్కారే అని ధ్వజమెత్తారు. దేశమంతటా ఐటి దాడులు జరుగుతున్నాయని..దేశంలో ఒక్క చంద్రబాబునాయుడే ఎందుకు గగ్గోలు పెడుతున్నారని కెటీఆర్ ప్రశ్నించారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమకు 16 సీట్లు ఇవ్వమని ప్రజలను కోరతామని...కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ లకు పూర్తి స్థాయి మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. ఆ సమయంలో టీఆర్ఎస్ దగ్గర 16 ఎంపీ సీట్లు ఉంటే డిమాండ్ తోపాటు కమాండ్ కూడా చేయవచ్చని వ్యాఖ్యానించారు. తమకు ఐదుగురు ఎమ్మెల్సీలు గెలిచే బలం ఉందని..కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలని కోరిందని తెలిపారు. మార్చి 1 నుంచి టీఆర్ఎస్ తరపున కెటీఆర్ తెలంగాణలో ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలనేది సీఎం ఇష్టప్రకారమే ఉంటుందని వ్యాఖ్యానించారు.

Next Story
Share it