వైసీపీలోకి కోట్ల హర్షవర్ధన్ రెడ్డి
కర్నూలు జిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓ వైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎవరి సీటుకు ఎవరు ‘ఎర్త్’ పెడతారో అన్న టెన్షన్ జిల్లాలోని నేతల్లో ఉంది. దీనికి కారణం ఎన్నికల ముందు జరుగుతున్న జంపింగ్ లే ప్రధాన కారణం. తాజాగా కాంగ్రెస్ పార్టీకి కర్నూలు జిల్లాలో మరో షాక్ తగిలింది. కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో సుమారు 2వేల మందితో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఈ సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీలతో పాటు, ఏడుగురు ఎంపీటీసీలు, పలువురు సర్పంచ్‌లు కూడా వైఎస్సార్ సీపీలో చేరారు. వైసీపీలో చేరిక సందర్భంగా కోట్ల హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ...వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.