Telugu Gateway
Politics

టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్

టీడీపీలో చేరిన కిషోర్ చంద్రదేవ్
X

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ టీడీపీలో చేరారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కిషోర్ చంద్రదేవ్ తో పాటు అరకు పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలు కూడా ఆయనతో పాటు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కిషోర్ చంద్రదేవ్ మాట్లాడుతూ బాక్సైట్ ఉద్యమాన్ని గుర్తుచేశారు. తన నియోజకవర్గం కాకపోయినా వ్యతిరేకించానని అన్నారు. ‘గిరిజనులకు జీవనోపాధి పోతుందని చెప్పాను. బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నాను. అప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ఆపగలిగాను కాను లైసెన్స్ రద్దు చేయించలేక పోయాను. లైసెన్స్ లు పూర్తిగా రద్దు చేసిన ఘనత చంద్రబాబుదే. బాక్సైట్ తవ్వకాల వెనుక నిజాలు జనానికి తెలియదు. ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే హత్య దురదృష్టకరం.

బాక్సెట్ తవ్వకాల వెనుక నిజాలను ప్రజలకు వివరించాలి. సమాఖ్య రాజ్య స్ఫూర్ధికి ప్రధాని మోది తూట్లు. 2019లో మోదికి వంద సీట్లు కూడా రావు. ఇటువంటి హింసా రాజకీయాలు గతంలో లేవు. ఢిల్లీలో బిజెపి రాకూడదనే ఇక్కడ టిడిపిలో చేరుతున్నా. కేంద్రం తోడ్పాటు లేకున్నా రాష్ట్రంలో గొప్ప అభివృద్ది. ఎన్డీఏకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తి సహకారం ఇస్తాను. టిడిపితో కలిసి పనిచేస్తా, రాష్ట్రాభివృద్దికి కృషి చేస్తా.’ అని వ్యాఖ్యానించారు. 41ఏళ్ల కిషోర్ చంద్రదేవ్ రాజకీయ చరిత్రలో ఒక మచ్చలేదని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. మంచివాళ్లు రాజకీయాల్లోకి రావాలన్నారు. మాజీ కేంద్రమంత్రిగా కిషోర్ చంద్ర దేవ్ సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

Next Story
Share it