Top
Telugu Gateway

దుబాయ్ లో ఎన్టీఆర్

దుబాయ్ లో ఎన్టీఆర్
X

అదేంటి ఆర్ఆర్ఆర్ సినిమాలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దుబాయ్ లో ఎందుకు ఉన్నారు అంటారా?. ప్రస్తుతం ఆయనకు సినిమాలో కాస్త బ్రేక్ దొరికింది. అయితే ఈ దుబాయ్ పర్యటన కూడా సినిమా కోసమే అని టాలీవుడ్ టాక్. రాజమౌళి సినిమాలు అంటే అందులో ఉండే హంగామా అంతా ఇంతా కాదు. పర్పెక్ట్ గా ఉండేవరకూ దేనిలో రాజీపడరు. సినిమాకు అవసరమైన మేరకు కొత్త మేకోవర్ కోసమే ఎన్టీఆర్ దుబాయ్ లో ఉన్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించి షెడ్యూల్ శరవేగంగా సాగుతోంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందుతున్న మల్టీస్టారర్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మాత. ఈ నెలాఖరు నుంచి మళ్లీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఎన్టీఆర్‌ జాయిన్‌ అవుతారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్‌ భామలు పరిణీతి చోప్రా, ఆలియా భట్‌ పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరి చివరకు ఎవరు ఉంటారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it