జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ
BY Telugu Gateway17 Feb 2019 1:11 PM GMT

X
Telugu Gateway17 Feb 2019 1:11 PM GMT
బీసీ గర్జన సాక్షిగా వైసీపీకి వచ్చే ఎమ్మెల్సీ సీటును జంగా కృష్ణమూర్తికి కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని, అందులో నాలుగు తెలుగుదేశంకు , ఒకటి వైసిపికి వస్తాయని,ఆ ఒక్కటి తాను బిసి నేత జంగా కృష్ణమూర్తికి ఇస్తున్నానని తెలిపారు. గురజాల అసెంబ్లీ టిక్కెట్ ను కాసు మహేష్ రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించినప్పుడు కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ని ఆఫర్ చేశారు.అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు.తదనుగుణంగా ఇప్పుడు జగన్ తన హామీని నెరవేర్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Next Story