Telugu Gateway
Top Stories

ఇండిగో సర్వీసుల రద్దు గందరగోళం

ఇండిగో సర్వీసుల రద్దు గందరగోళం
X

కారణాలు ఏవైనా దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థలు అన్నీ సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్ వేస్ తీవ్ర ఆర్థిక చిక్కుల్లో పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో జెట్ ఎయిర్ వేస్ సేవలకు అప్పుడప్పుడు విఘాతం కలుగుతోంది. గత కొన్ని రోజులుగా ఇండిగో సర్వీసుల రద్దు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పైలట్ల కొరతతోనే సర్వీసులు రద్దు అవుతున్నట్లు చెబుతున్నా..ఇప్పటివరకూ ఎప్పుడూ ఈ స్థాయిలో ఉత్ఫన్నం కాని పైలట్ల సమస్య ఇప్పుడు కొత్తగా ఎందుకొచ్చింది అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

అయితే ఇండిగో పైలట్ల సమస్య ఇప్పట్లో ముగిసేలా లేదు. దీంతో సర్వీసుల రద్దు అలాగే కొనసాగే అవకాశం కన్పిస్తోంది. తమ విమాన సర్వీసుల రద్దు ప్రక్రియ మరికొంతకాలం కొనసాగనుందని ప్రకటించింది. రోజుకు కనీసం 30 విమాన సేవలు రద్దు కానున్నాయంటూ ఇండిగో ప్రకటించింది. దీంతో ప్రయాణికులకు మరిన్ని రోజులు కష్టాలు తప్పేలా లేవు. ఈ సోమవారం దేశంలోని వివిధ నగరాల్లో 32విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. మంగళవారం మరో 30 విమానాలను రద్దు చేసింది. విమానాల సర్వీసుల కోత కొన్ని రోజులపాటు కొనసాగనుందని తాజాగా వెల్లడించింది. ఈ వ్యవహారంపై డీజీసీఏ దృష్టి సారించింది.

Next Story
Share it