Telugu Gateway
Andhra Pradesh

మెగా..నవయుగాలే చంద్రబాబుకు ముఖ్యం

మెగా..నవయుగాలే చంద్రబాబుకు ముఖ్యం
X

ఈ సంస్థలకు ‘మొబిలైజేషన్ అడ్వాన్స్’పై ప్రత్యేక శ్రద్ధ

ఏపీలో 14 వేల కోట్ల బిల్లులకు బ్రేక్

ఒక్క సాగునీటి శాఖలోనే 4000 కోట్ల బకాయిలు

ఏపీలో చేసిన పనులకు సర్కారు చెల్లించాల్సిన మొత్తం ఏకంగా 14వేల కోట్ల రూపాయల వరకూ ఉంది. అందులో ఒక్క సాగునీటి శాఖలో చెల్లించాల్సిన బిల్లులే 4000 కోట్ల రూపాయల వరకూ ఉన్నాయి. అయినా ఇది ఎన్నికల సీజన్ కదా?. సర్కారు కూడా అందినంత దండుకునే పనిలో పడింది. అందుకే ఆర్థిక శాఖ ససేమిరా అన్నా కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం మెగా ఇంజనీరింగ్, నవయుగా సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాల్సిందే అని తేల్చిచెప్పారు. పెన్నా-గోదావరి అనుసంధాన ప్రాజెక్టు పనులను పక్కా వ్యూహాం ప్రకారం ఈ రెండు సంస్థలకు చంద్రబాబు పంచిన సంగతి తెలిసిందే. అంతే కాదు..ఇప్పుడు ఇవే సంస్థలకు కలిపి 450 కోట్ల రూపాయలపైన మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇచ్చి..ఎన్నికల ముందు తమ వాటా తాము తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

నిజానికి ఈ పనులు ఇప్పటికిప్పుడు మొదలయ్యేది లేదు...పైగా వీటికి ఇంకా చాలా సమయం ఉంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇఛ్చిన రైతు రుణ మాఫీకి సంబంధించి ఇంకా సర్కారు రైతులకు 8200 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ అదేమి పట్టని చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులపై ఒత్తిడి చేసి మరీ ఈ రెండు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్ లు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. త్వరలోనే ఈ చెల్లింపులు జరగనున్నట్లు సమాచారం. ఏపీ ఇప్పుడు ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాజధాని భూములతో పాటు ఏపీలో అన్ని ఆస్తులను తనఖా పెట్టి మరీ సర్కారు ఎడాపెడా అప్పులు చేస్తూ ముందుకు సాగుతోంది. వచ్చే ఆరేళ్ల వరకూ అప్పులు చెల్లించేందుకే బడ్జెట్ వనరులు సరిపోతాయని..కొత్తగా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆర్ధిక శాఖ స్పష్టంగా చెబుతున్నా సరే..చంద్రబాబు మాత్రం తనదైన ‘దోపిడీ స్కీమ్ ’లతో ముందుకెళుతూనే ఉన్నారు.

Next Story
Share it