Telugu Gateway
Cinema

‘ఓ మై గాడ్’ అంటున్న కళ్యాణ్ రామ్

‘ఓ మై గాడ్’ అంటున్న కళ్యాణ్ రామ్
X

నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా 118. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి పెంచేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జోడీగా నివేదా థామస్, సంచలన సినిమా అర్జున్ రెడ్డిలో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండే నటించారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది.

ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. గత కొంత కాలంగా సరైన హిట్ లేకుండా బాధపడుతున్న కళ్యాణ్ రామ్ కు ఈ 118 ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?time_continue=42&v=STzTuUAxSaY

Next Story
Share it