‘మహానాయకుడి’కి బ్రాండ్ అంబాసిడర్ గా బాబు
తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాలకృష్ణ నిర్మించి, నటించిన ‘మహానాయకుడు’ సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ కంటే చంద్రబాబునే వీరుడిగా చూపించారు. మరి ఇదే చంద్రబాబు ఎన్టీఆర్ సినీ జీవిత చరిత్రకు సంబంధించిన ‘కథానాయకుడు’పై ఎందుకు ఇంత ప్రచారం చేయలేదు?. గత కొన్ని రోజులుగా పార్టీ నేతలతో నిర్వహించే టెలికాన్ఫరెన్స్ లో ‘మహానాయకుడి’ గురించి పదే పదే చెబుతున్నారు. బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడిన ఈ సినిమాను ఎలాగైనా గట్టెక్కించాలని పని పెట్టుకున్నారు. అయినా కూడా ఎక్కడా వర్కవుట్ అవుతున్న దాఖలాలు లేవు. మంగళవారం నాడు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మహానాయకుడి సినిమా గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘ 37ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో అనేక పోరాటాలు. 12ఏళ్ల టిడిపి చరిత్ర ‘మహానాయకుడు’ సిన్మా. ఆటోలకు పసుపు జెండాలతో ‘మహానాయకుడు’ సిన్మాకు వెళ్తున్నారు. 37ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో అనేక పోరాటాలు. 12ఏళ్ల టిడిపి చరిత్ర ‘మహానాయకుడు’ సిన్మా.
ఆటోలకు పసుపు జెండాలతో ‘మహానాయకుడు’ సిన్మాకు వెళ్తున్నారు. ట్రాక్టర్లకు పసుపు జెండాలతో మహానాయకుడు సిన్మాకు వెళ్తున్నారు. ఈ స్ఫూర్తి అన్ని ప్రాంతాలలో కొనసాగాలి. మహానాయకుడి చరిత్రపై అవగాహన పెంచుకోవాలి. యువతరం,ఫస్ట్ టైమ్ ఓటర్లు ఈ సిన్మా చూడాలి. తెలుగుజాతి సత్తా ఏంటో ప్రస్తుత తరం తెలుసుకోవాలి. ఆంధ్రుల ఆత్మాభిమానం గురించి తెలుసుకోవాలి. ‘మహా నాయకుడు’ సినిమా మనందరి సినిమా. చరిత్ర తెలిసినవాళ్లంతా టిడిపికే ఓటేస్తారు. టిడిపికి వేసే ఓటు అభివృద్దికి ఓటు. ‘సైకిల్’ కు వేసే ఓటు పేదల సంక్షేమానికి ఓటు. అరాచకాలు కోరేవాళ్లే వైసిపికి ఓటేస్తారు. వైసిపికి వేసే ఓటు రౌడీయిజానికి ఓటు. రౌడీలకు అధికారం వస్తే ఆంధ్రప్రదేశ్ అధోగతే. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్దికి చిరునామా చేయాలి.’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.