Telugu Gateway
Cinema

‘118’ ట్రైలర్ వచ్చేసింది

‘118’ ట్రైలర్ వచ్చేసింది
X

నందమూరి కళ్యాణ్ రామ్, నివేదా థామస్, షాలిని పాండేలు నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ‘118’ ట్రైలర్ వచ్చేసింది. టైటిల్ తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ లో ఈ సినిమా ఎంత సస్పెన్స్ క్రియేట్ చేస్తుందో చూపించే ప్రయత్నం చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ప్రారంభంలో షాలిని పాండే ఇంటి తలుపు ఓపెన్ చేయటం..కళ్యాణ్ రామ్ ఎంట్రీతో స్టార్ట్ అవుతుంది. ‘నువ్వు ఒకప్పుడు వాడి డ్రీమ్ గర్ల్ కావొచ్చు. ఇప్పుడు వాడి డ్రీమ్ గర్ల్ వేరే’ అంటూ ప్రభాస్ శ్రీను చెప్పే డైలాగు ఉంటుంది.

‘ఆమె చూపు ..ఆమె మొఖం..ఆ అమ్మాయి ఉండి ఉంటుందా?’ అంటూ కళ్యాణ్ రామ్ నివేదా థామస్ వెతికే సన్నివేశాలను ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ఈ సినిమా మార్చి1న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల వేగం పెంచింది. మరి ఈ సినిమా అయినా కళ్యాణ్ రామ్ హిట్ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

https://www.youtube.com/watch?v=KypNI5ug4vk

Next Story
Share it