Telugu Gateway
Cinema

కొత్త సినిమాకు వరుణ్ తేజ్ ఓకే

కొత్త సినిమాకు వరుణ్ తేజ్ ఓకే
X

‘అంతరిక్షం’లో ఆకట్టుకున్నాడు. ఎఫ్2లో నవ్వించాడు. ఇప్పటికే అర్థం అయిపోయిందిగా ఆయన ఎవరో. ఆయనే వరుణ్ తేజ్. దూకుడు మీదున్న ఈ హీరో మరో కొత్త ప్రాజెక్టుకు రెడీ అయిపోయాడు. తాజా సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో కలసి చేయనున్నట్లు సమాచారం. కోలీవుడ్ సూపర్‌ హిట్ సినిమా జిగర్తాండకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. వరుసగా ప్రయోగాత్మక చిత్రాలతో ఆకట్టుకుంటున్న వరుణ్‌ ఈ సినిమాతో మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు.

ఈ రీమేక్‌లో వరుణ్ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఒరిజినల్‌ వర్షన్‌లో సిద్ధార్థ్‌ చేసిన పాత్రలో వరుణ్ నటింస్తున్నాడు. 14 రీల్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Next Story
Share it