Telugu Gateway
Politics

తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్..భారీగా తగ్గిన ఓటింగ్ శాతం

తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్..భారీగా తగ్గిన ఓటింగ్ శాతం
X

ఆంధ్రప్రదేశ్ లోని అధికార తెలుగుదేశం పార్టీకి ఇది భారీ షాక్. గతంతో పోలిస్తే తాజాగా ఏపీలో టీడీపీ ఓటు శాతం గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీకి మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు శాతం మాత్రమే ఉండేది. టీడీపీ కంటే వైసీపీకే అధికంగా ఐదు శాతం ఎడ్జ్ ఉండేది. ఇప్పుడు అది ఏకంగా దాదాపు ఎనిమిది శాతానికి చేరటం విశేషం. రిపబ్లిక్ టీవీ-సీ ఓటర్ తాజాగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన అంచనాలు అధికార టీడీపీనీ విస్మయానికి గురిచేసేలా ఉన్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 19 ఎంపీ సీట్లు...టీడీపీకి 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది.

వైసీపీకి వచ్చే ఓట్ల శాతం 41.3 శాతం ఉంటే..టీడీపీకి ఓట్ల శాతం 33.1 గా రిపబ్లిక్ టీవీ పేర్కొంది. ఇతరులకు 8.6 శాతం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. జనవరి నెలలో ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలు వస్తాయని తాజా సర్వేలో తేలింది. రాజకీయాలు డైనమిక్ అన్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఏ పరిణామం చోటుచేసుకుంటుందో...మొగ్గు ఎటువైపు మారుతుందో వేచిచూడాల్సిందే. ఎన్నికలకు ఇంకా దాదాపు మూడు నెలల సమయం ఉంది. ఈ సమయంలో జరిగే ఫరిణామాలు కూడా అత్యంత కీలకంగా మారనున్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం వైసీపీకి అనుకూలంగా వాతావరణం ఉన్నట్లు రిపబ్లిక్ టీవీ- సీ ఓటర్ సర్వే తెలిపింది.

Next Story
Share it