Telugu Gateway
Top Stories

ముంబయ్ లో డ్యాన్స్ బార్లకు గ్రీన్ సిగ్నల్

ముంబయ్ లో డ్యాన్స్ బార్లకు గ్రీన్ సిగ్నల్
X

దేశ ఆర్థిక రాజధాని ముంబయ్ లో ఎప్పటి నుంచో ఆగిపోయిన ‘డ్యాన్స్ బార్లు’ మళ్లీ తెరుచుకోనున్నాయి. సుప్రీంకోర్టు ఈ బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో మళ్లీ సందడి ప్రారంభం కానుంది. అయితే రాత్రి 11.30 గంటల వరకూ ఈ బార్లు తెరిచి ఉండాలని ఆదేశించారు. అంతే కాకుండా డ్యాన్స్ చేసే అమ్మాయిలపై డబ్బు విసిరేయటం, బార్లలో సీసీటీవీలు పెట్టడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా చేసింది.

ముంబయ్ లో డ్యాన్స్ బార్లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ బార్ల యాజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా..ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా మందిరాలకు కిలో మీటర్‌ దూరంలో డ్యాన్స్‌ బార్లను ఏర్పాటు చేయరాదనే రాష్ట్ర ప్రభుత్వ నిబంధన.. ముంబైలాంటి మహానగరాల్లో సాధ్యపడదని తెలిపింది. అయితే డ్యాన్సు చేసేవారికి, బార్‌ ఓనర్‌లకు మధ్య తప్పకుండా కాంట్రాక్టు ఉండాలని ఆదేశించింది.

Next Story
Share it