Top
Telugu Gateway

శబరిమల ఆలయం మూసివేత

శబరిమల ఆలయం మూసివేత
X

శబరిమలలో బుధవారం తెల్లవారుజాము నుంచి కలకలం. ఇద్దరు మహిళలు ఆలయ ప్రవేశం చేయటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాదు..సంప్రోక్షణ కోసం ఏకంగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశం పెద్ద దుమారం రేపుతోంది. కోజికొడె జిల్లాకు చెందిన 50 సంవత్సరాల లోపు మహిళలు బిందు, కనకదుర్గ ఎవరూ కనిపెట్టకుండా దుస్తులు ధరించి ఆలయంలోకి ప్రవేశించారు.

వీరు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని కేరళ సీఎం విజయన్ కూడా ధృవీకరించారు. దర్శనం కోసం వచ్చే మహిళలకు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.అయితే శాస్త్రెోక్తంగా సంప్రోక్షణ అనంతరం ఆలయం మళ్ళీ తెరిచారు. ఎప్పటిలాగానే మళ్లీ భక్తులను అనుమతిస్తున్నారు.

Next Story
Share it