రవిబాబు ‘ఆవిరి’
BY Telugu Gateway2 Jan 2019 5:57 PM IST
X
Telugu Gateway2 Jan 2019 5:57 PM IST
ఓ చిన్న పందిపిల్లతో ‘అదుగో’ సినిమాతో ముందుకొచ్చి ప్రేక్షకులను నిరాశపర్చిన దర్శకుడు, నటుడు రవిబాబు మరో కొత్త ప్రయోగానికి రెడీ అయ్యారు. ఈ సారి ఆయన ‘అవిరి’ అంటూ ముందుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆయన విడుదల చేసిన లుక్ ఆసక్తికరంగా ఉంది. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్రం కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేశారు.
గాజు సీసా లోపల అమ్మాయి ఉండటం.. ఆ సీసా మూతని ఎవరో ఓపెన్ చేస్తుంటే ఆవిర్లు బయటికి వస్తుండటం వంటి ఆసక్తికర అంశాలు ఇందులో ఉన్నాయి. ‘‘ఇది ఒక ఆఫ్ బీట్ చిత్రం. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను, నటీనటులను ప్రకటిస్తాం’’ అని రవిబాబు తెలిపారు. ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించనున్నారు.
Next Story