Telugu Gateway
Cinema

కాజల్ ఎందుకలా చేసింది?

కాజల్ ఎందుకలా చేసింది?
X

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు దశాబ్దానికి పైగా పలు భాషల్లో హీరోయిన్ గా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన కాజల్ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న చర్చ సాగుతోంది. పైగా ఈ సీన్ ఒరిజినల్ సినిమాలో లేకపోయినా ఎందుకు ఇలా చేశారు?. దీని వెనక కారణాలు ఏంటి అన్న అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ సీన్ ఉన్న సినిమా టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.

ఈ టీజర్ ద్వారా కాజల్ గతంలో నయనతారపై ఉన్న రికార్డును బ్రేక్ చేసేసింది. హిందీలో సూపర్ హిట్ అయిన సినిమా క్వీన్ ను పలు భాషల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోతమిళంలో ప్యారిస్ ప్యారిస్ పేరుతో తెరకెక్కిస్తున్నారు. తమిళ సినిమా టీజర్ లోని అభ్యంతరకర సన్నివేశంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ టీజర్ ను డెబ్బయి లక్షల మందికిపైగా వీక్షించారు.

https://www.youtube.com/watch?v=-LSzzQ0ZLiU

Next Story
Share it