‘మహర్షి’ ఫోటోలు లీక్

‘భరత్ అనే నేను’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సినిమా స్టిల్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ మహేష్ బాబు సినిమాకు సంబంధించి అచ్చం అదే జరిగింది. ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘మహర్షి’. ఈ సినిమాకు సంబంధించి కొన్ని స్టిల్స్...వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ సృష్టించింది. ఇవి చూస్తుంటే కొత్త సినిమాలోనూ మహేష్ బాబు మీడియాతో మాట్లాడినట్లు కన్పిస్తోంది.
భరత్ అనే నేను సినిమా మహేష్ బాబు విలేకరుల సమావేశం హైలెట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో మహేష్ తొలిసారిగా గడ్డంతో నటిస్తున్నాడు. ఇప్పటికే మహేష్ న్యూలుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.