Telugu Gateway
Cinema

ఎన్టీఆర్..రామ్ చరణ్ ఇక దానికే అంకితం!

ఎన్టీఆర్..రామ్ చరణ్ ఇక దానికే అంకితం!
X

ఇక సమయం అంతా దానికే. ముందు అది పూర్తి చేసిన తర్వాతే ఏదైనా?. ఇంతకీ ఏంటి అది అంటారా?. అదేనండి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా షూటింగ్ రెండవ షెడ్యూల్ సోమవారం నుంచి ప్రారంరభం అయింది. గతానికి భిన్నంగా ఈ సారి రాజమౌళి తన సినిమాను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల రూపాయలుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాత దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ల పేర్లు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

ఇప్పటికే కీర్తి సురేష్, పూజా హెగ్డె తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇంత వరకూ వెలువడలేదు. ఇప్పుడు కొత్తగా ఓ పాత్రకు అదితి రావు హైదరీ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. అత్యంత కీలకమైన రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కావటంతో త్వరలోనే చిత్రంలోని ఇతర నటీనటుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకు హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లు దర్శకుడు రాజమౌళి కోరినట్లు ఎక్కువ సమయం కేటాయించటానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. సో..ఈ కొత్త సినిమా అప్ డేట్స్ ఇక నిత్యం రాబోతున్నాయన్నమాట.

Next Story
Share it