‘ఇస్మార్ట్’ హీరోయిన్ గా నిధి
BY Telugu Gateway28 Jan 2019 2:46 PM GMT

X
Telugu Gateway28 Jan 2019 2:46 PM GMT
రామ్ కొత్త సినిమాకు హీరోయిన్ దొరికేసింది. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ పూర్తి మాస్.. మసాలలతో కూడిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభం అయింది. ఇప్పుడు చిత్ర యూనిట్ అధికారికంగా ఈ సినిమాలో రామ్ కు జోడీ నిధి అగర్వాల్ నటించనుందని ప్రకటించింది.
ఇప్పటికే నిధి టాలీవుడ్ లో సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఆశిష్ విద్యార్థి, సత్య దేవ్, సుధాన్ష్ పాండేలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా వేసవిలో సందడి చేసే అవకాశం ఉంది.
Next Story