సరదా సరదాగా ఎఫ్ 2 ట్రైలర్
BY Telugu Gateway7 Jan 2019 8:37 PM IST
X
Telugu Gateway7 Jan 2019 8:37 PM IST
సీనియర్ హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ సంక్రాంతి పండగ సందర్భంగా నవ్వులు పూయించటానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే టీజర్ తో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు ట్రైలర్ తోనూ నవ్వులు పూయిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లు తొలిసారి కలసి నటించిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంది. ఈ ట్రైలర్ లోని డైలాగ్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
‘చివరగా ఓ సారి నవ్వుకుని తాళికట్టు నాయనా’ అంటూ పూజారి హీరో వెంకటేష్ తో చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ నటించారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోలు భార్యా బాధితులుగా కన్పిస్తున్నారు.
https://www.youtube.com/watch?v=XttQbFKkeHQ
Next Story