Telugu Gateway
Politics

వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు

వైసీపీలోకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు
X

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. దివంగత ఎన్టీఆర్ అల్లుడు, మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో చేరనున్నారు. తన కుమారుడు హితేష్ తో కలసి ఆయన ఆదివారం నాడు హైదరాబాద్ లో వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. పార్టీలో ఎప్పుడు చేరే తేదీ ప్రకటించాల్సి ఉంది తప్ప..చేరిక ఖాయం అని తేలిపోయింది. సుమారు గంట పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ లు జగన్ తో సమావేశం అయ్యారు. అందరితో చర్చించి వైసీపీలో చేరే తేదీని ప్రకటిస్తామని తెలిపారు. దగ్గుబాటి తనయుడు హితేష్ కు ప్రకాశం జిల్లాలోని పర్చూరు సీటు నుంచి పోటీచేస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. హితేష్‌తో కలిసి జగన్‌ నివాసానికి చేరుకున్న దగ్గుబాటికి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వరావు భార్య పురందేశ్వరి బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

జగన్ తో భేటీ అనంతరం దగ్గుబాటి మీడియాతో మాట్లాడారు. పురంధేశ్వరి రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రస్తుతం ఉన్న బిజెపిలోనే ఉంటారని..లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పారు. అంతే తప్ప ఆమె కొత్తగా ఏ పార్టీలో చేరరని తెలిపారు. కుటుంబపరంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అదే సమయంలో చంద్రబాబుపై దగ్గుపాటి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ నిధులతో దీక్షలు చేసిన ప్రభుత్వాలు గతంలో తాను ఎన్నడూ చూడలేదన్నారు. అంతే కాకుండా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. జగన్ సమర్థవంతంగా పార్టీని నడుపుతున్నారని దగ్గుబాటి వ్యాఖ్యానించారు.

Next Story
Share it