Top
Telugu Gateway

నలభై ఏళ్ళ అనుభవం..46 సంవత్సాలకు భయపడిందా! ?

నలభై ఏళ్ళ అనుభవం..46 సంవత్సాలకు భయపడిందా! ?
X

అగ్రవర్ణ పేదలకు ప్రధాని మోడీ ఇప్పుడే ఎందుకు రిజర్వేషన్లు ఎందుకు ప్రకటించారు?. ఓడిపోతామనే భయంతోనే. ఇంత కాలం లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు వాళ్ళపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇదీ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మొదలుకుని...టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు. మరి ఇఫ్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసింది ఏమిటి?. పెన్షన్లు అందుకుంటున్న వారంతా మాకు పెన్షన్లు పెంచాలని రోడ్డు మీదకు వచ్చి ఉద్యమాలు చేశారా?. పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారా?. సడన్ గా ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబుకు ఎందుకు పెన్షన్ దారులపై ప్రేమ పుట్టుకొచ్చింది?. మోడీ డబ్బులు ఇవ్వకపోయినా..కేంద్రం సహకరించకపోయినా..ప్రతిపక్షాలు నిత్యం అడ్డుపడుతున్నా దేశంలోనే ఏపీని అగ్రస్థానంలో నిలిపానని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబునాయుడు మళ్ళీ గెలవలేమని ఎందుకు భయపడుతున్నారు?.

నిజంగా పెన్షన్ దారులు అంత కష్టాల్లో ఉంటే..ఈ నాలుగున్నర సంవత్సరాలు వదిలేసి..ఆకస్మాత్తుగా ఎందుకు పెన్షన్ మొత్తం రెండు వేలకు పెంచుతూ ప్రకటన చేసినట్లు?. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు..46 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నారా?. లేకపోతే జగన్ హామీలను చంద్రబాబునాయుడు ఎందుకు అమలు చేయటం ప్రారంభించారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని ఎప్పుడో హామీ ఇఛ్చారు. ఆ హామీలను ఇఫ్పుడు చంద్రబాబునాయుడు అమలు చేయటం ప్రారంభించారు.

అసలు దేశంలోనే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా ఏపీని నిలిపిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు టెన్షన్ లో ఉన్నారు. మోడీ ఎన్నికల ముందు అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ప్రకటించటం తప్పు అయినప్పుడు ఎన్నికలకు మూడు నెలల ముందు పేదలకు ఇఛ్చే పెన్షన్లను చంద్రబాబునాయుడు పెంచటం ఓట్ల రాజకీయం కాక మరేమి అవుతుంది?. కానీ కొంత మందికి చంద్రబాబు ఏది చేస్తే అది అద్భుతం..పేదలకు వరంగానే కన్పిస్తుంది. కానీ అసలు విషయం మాత్రం చెప్పరు.

Next Story
Share it