Telugu Gateway

ముంబయ్ ఆస్పత్రిలో బ్రహ్మానందం

ముంబయ్ ఆస్పత్రిలో బ్రహ్మానందం
X

వెండి తెరపై తెలుగు ప్రేక్షకులను దశాబ్దాల పాటు తన నటనతో నవ్వించిన బ్రహ్మానందం గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నారు. ఆయన్న ముంబయ్ లోని ఓ ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందిస్తున్నారు. బ్రహ్మానందానికి హార్ట్ సర్జరీ నిర్వహించారని సమాచారం. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్‌ ఇన్సిస్టిట్యూట్‌లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు.

డాక్టర్‌ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది. బ్రహ్మానందం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా కోరుతున్నారు. ఆయన కుమారులు గౌతమ్‌, సిద్ధార్థ్‌లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు.

Next Story
Share it