Telugu Gateway
Top Stories

అమెజాన్ సీఈవో సంచలనం

అమెజాన్ సీఈవో సంచలనం
X

జెఫ్ బొజెస్. ఆన్ లైన్ లావాదేవీల గురించి అవగాహన ఉన్న వారిలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థ ‘అమెజాన్’. ఆ సంస్థ వ్యవస్థాపకుడు..సీఈవోనే ఈ జెఫ్ బెజోస్. ఆయన తన 54 సంవత్సరాల వయస్సులో విడాకులు తీసుకోనున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ఈ విడాకులు ఇద్దరి ఆమోదంతోనే సాగుతున్నాయని..రాబోయే రోజుల్లో తాము ఫ్రెండ్స్ గా కొనసాగుతామని ప్రకటించారు. జెఫ్ బెజోస్, భార్య మెక్కెంజే ఇద్దరూ ఓ అంగీకారంతోనే విడాకులు తీసుకోవాలని నిర్ణయించు కున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మా జీవితాల్లో చోటుచేసుకున్న ఒక ముఖ్యమైన ఘట్టాన్ని హితులు, సన్నిహితుల దృష్టికి తీసుకొస్తున్నామంటూ ట్వీట్‌ చేశారు. పాతికేళ్లపాటు భార్యభర్తలుగా ఎంతో సంతోషంగా జీవించామనీ, అయితే విడాకులు తీసుకుంటున్నప్పటికీ స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు. పరస్పర ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అయితే ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో భాగస్వాములుగా కొనసాగుతామని సంయుక్త ప్రకనటలో తెలిపారు. మెకెంజీ (48 రచయిత్రి. న్యూయార్క్‌ లో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లిన సమయంలో 1993లో తొలిసారిగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి ప్రేమ చిగురించింది. ఆరునెలల తరువాత అదే సంవత్సరం పెళ్లి చేసుకున్నారు.

వీరికి నలుగురు పిల్లలు. మెకెంజీ రెండు నవలలు కూడా రాశారు. 1994లో ఆన్‌లైన్ బుక్సెల్లర్‌గా ఏర్పాటైన అమెజాన్‌ ఆ తర్వాత అంచలంచెలుగా ఎదిగి.. ప్రపంచ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. అమెజాన్ సంస్థను ఏర్పాటు చేసిన తొలినాళ్లలో మెకంజీ తన బిజినెస్‌కు ఎంతో సహకారం అందించారని పలు సందర్భాల్లో జెఫ్ బిజోస్ గుర్తు చేసుకున్నారు. కేవలం రెండు రోజుల క్రితమే అమెజాన్‌ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. అమెజాన్‌ భారీ మార్కెట్‌ క్యాప్‌తో మైక్రోసాఫ్ట్‌ ను వెనక్కినెట్టి టాప్‌ ప్లేస్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఓ టీవీ యాంకర్ తో సన్నిహితంగా ఉంటున్న జెఫ్ బెజోస్ ఈ కారణంగానే విడాకుల నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

Next Story
Share it