Telugu Gateway
Cinema

‘వినయ విధేయ రామ’ విధ్వంసం

‘వినయ విధేయ రామ’ విధ్వంసం
X

రామ్ చరణ్ హీరోగా నటించిన ‘వినయ విధేయరామ’ సినిమా ట్రైలర్ విధ్వంసం సృష్టిస్తోంది. డైలాగులు..పంచ్ లతో ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించింది. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను తనదైన మార్క్ తో సినిమాను తెరకెక్కించినట్లు కన్పిస్తోంది. టైటిల్ లో వినయం ఉంది కానీ..ట్రైలర్ లో మాత్రం అంతా రివర్స్ లోనే ఉంది. చిత్ర యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్‌ తరువాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తున్న వినయ విధేయ రామ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. గురువారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

సరైన సింహం తగలనంతవరకు ప్రతీ వేటగాడు మగాడేరా.. అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్‌ మాస్‌కు పిచ్చేక్కించేలా ఉంది. ఇప్పటివరకు యాక్షన్‌ సీన్స్‌ ను తనదైన శైలిలో చూపించిన బోయపాటి.. చెర్రీలోని విశ్వరూపాన్ని చూపించేశారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్‌ సంగీతమందించారు. భరత్‌ అనే నేను ఫేమ్‌ కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. స్నేహ, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేశ్‌, వివేక్‌ ఒబేరాయ్‌ కీలకపాత్రల్లో నటించారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.

https://www.youtube.com/watch?time_continue=4&v=aV5HMqRas5g

Next Story
Share it