Telugu Gateway

విజ‌య్ మాల్యాకు షాక్

విజ‌య్ మాల్యాకు షాక్
X

భార‌తీయ బ్యాంకుల‌కు భారీ ఎత్తున టోపీ పెట్టి లండ‌న్ ప‌రారు అయిన పారిశ్రామిక‌వేత్త విజ‌య్ మాల్యాకు షాక్. ఆయ‌న్ను భార‌త్ కు అప్ప‌గించేందుకు బ్రిట‌న్ కోర్టు ఆమోదించింది. ఈ మేర‌కు భార‌త్ వాద‌న‌ను కోర్టు స‌మ‌ర్థించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకోవ‌టానికి మాల్యాకు 14 రోజులు గ‌డువు ఇచ్చింది. ఈ అప్పీల్ ను కోర్టు తిర‌స్క‌రిస్తేనే మాల్యాను భార‌త్ తీసుకురావ‌టం సాధ్యం అవుతుంది. ఈ కేసును పుర‌స్కరించుకుని ఎన్ ఫోర్స్ మెంట్ డైర‌క్ట‌రేట్ తోపాటు ప‌లు కీల‌క విభాగాల అధికారులు లండ‌న్ చేరుకున్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ మాల్యా భార‌త్ లోని బ్యాంకుల‌కు దాదాపు 9000 కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టి ప‌రార్ అయిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న‌ను ఎగ‌వేత దారు అంటే అంగీక‌రించ‌న‌ని..బ్యాంకులు చెల్లించాల్సిన అస‌లు మొత్తం ఇవ్వ‌టానికి తాను ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. తాను డ‌బ్బు ఇస్తానన్న‌ది అబ‌ద్ధం కాదు అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it