Telugu Gateway
Politics

సండ్ర సైకిల్ దిగి కారెక్కుతారా!

సండ్ర సైకిల్ దిగి కారెక్కుతారా!
X

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో దక్కించుకున్నదే రెండు సీట్లు. ఆ రెండు సీట్లలో ఒకటి మాత్రం పక్కాగా మారిపోయేలా కన్పిస్తోంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సైకిలు దిగి కారెక్కటం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై సండ్ర కూడా గట్టిగా స్పందిస్తున్న దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది టీఆర్ఎస్ లో చేరినా సండ్ర వెంకటవీరయ్య మాత్రం టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలవటానికి ఇది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది. కానీ ఇప్పుడు సండ్ర వెంకటవీరయ్య ను మంత్రి పదవి ఆశ చూపి టీఆర్ఎస్ లో చేర్చుకునుందకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాత్రం తాను పార్టీ మారటంలేదని స్పష్టం చేశారు. తాజా ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేయగా సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు మాత్రమే గెలిచారు. ఇద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కావడం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28 వరకు వివిధ రాష్ట్రాల పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో 25 నాటికి సండ్ర చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story
Share it