Telugu Gateway
Cinema

ముంబయ్ చేరుకున్న సోనాలీ బింద్రే

ముంబయ్ చేరుకున్న సోనాలీ బింద్రే
X

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సోనాలీ బింద్రే. ఎందుకంటే ఆమె తెలుగులో పలు సినిమాలు చేశారు. ఆమెకు ఇక్కడ అభిమానులు కూడా ఎక్కువే. కొద్ది రోజుల క్రితం ఆమె తాను క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది. న్యూయార్క్‌ లో చికిత్స పొందుతున్న హీరోయిన్‌ సోనాలీ బింద్రే ముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె భర్త గోల్డీ బెహల్‌ కూడా ఉన్నారు. గత కొంత కాలంగా హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలీ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. భారత్‌లో సాధారణ జీవితం గడిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘నా హృదయం ఎక్కడైతే ఉందో(భారత్‌) అక్కడికి బయలుదేరుతున్నాను. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. కానీ నేను ప్రయత్నిస్తాను.

చాలా రోజుల తరువాత నా కుటుంబాన్ని, మిత్రులను కలుసుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించే అంశం. కాన్సర్‌తో నా పోరాటం ఇంకా ముగియలేదు. కానీ ఈ సమయాన్ని నేను ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాన’ని సోనాలీ ఆ సందేశంలో పేర్కొన్నారు. భారత్ కు వస్తున్న విషయాన్ని తెలుపుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సోనాలీ ఆరోగ్య పరిస్థితిపై గోల్డీ మాట్లాడుతూ.. సోనాలీ ప్రస్తుతం బాగానే ఉందని తెలిపారు. తను వేగంగా కోలుకుంటుందని.. ప్రస్తుతానికి చికిత్స ముగిసిందని పేర్కొన్నారు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరిగి రావచ్చు.. అందుకే రెగ్యూలర్‌​గా చెకప్‌లు చెయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Next Story
Share it