సినీ హీరోల కన్నా కెసీఆర్ అందగాడు..వర్మ ట్వీట్
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. అప్రతిహత విజయాన్ని అందుకున్న కెసీఆర్ పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అది కూడా రొటీన్ గా కాకుండా తనదైన శైలిలో. ‘సినీ హీరోయిన్ల కన్నా కేసీఆరే అందంగా ఉంటారని నేను ఎప్పుడు నమ్మేవాడిని, తాజా ఫలితాలు చూస్తే కేసీఆర్ సినీ హీరోల కన్నా అందగాడని, హిమాలయాలకన్నా ఆకర్షనీయుడనిపిస్తోంది.’ అని ట్వీట్ చేశారు.
గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అతి పెద్ద విగ్రహం పెడితే తెలంగాణ లో దానికి రెండు రెట్లు కేసీఆర్ విగ్రహం పెట్టాలని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే ఒక స్పూఫ్ వీడియోను కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ‘ హే కేటీఆర్ మీ డాడీ.. 2.0 కాదు.. రజనీకాంత్ కన్నా 20 రెట్లు.. మహేశ్ బాబు కన్నా 200 రెట్లు.. చంద్రబాబు నాయుడు కన్నా 2వేల రెట్లు ఎక్కువ.’ అని ట్వీట్ చేశారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఈ విషయం తనకు ముందే తెలుసని బదులిచ్చారు.