Telugu Gateway
Cinema

పూరీ డైరక్షన్ లో రామ్ సినిమా

పూరీ డైరక్షన్ లో రామ్ సినిమా
X

ఎనర్జిటిక్ హీరో రామ్. డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాధ్. వీరిద్దరి కాంబినేషన్ లో కొత్త సినిమా. పూరీ ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో హీరో రామ్ ఆయనతో సినిమాకు అంగీకరించటం ఆసక్తికర పరిణామమే. ఈ కొత్త సినిమాను పూరీ జగన్నాధ్ తన సొంత బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా 2019 జనవరిలో ప్రారంభించి మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

పూరి భార్య లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు నటి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్న ఈ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ కొత్త సినిమా విషయాన్ని ఛార్మి కౌర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరి రామ్ సినిమాతో అయినా పూరీ గాడిలో పడతారా? వేచిచూడాల్సిందే.

Next Story
Share it