ఎన్టీఆర్ అలా మారిపోయాడేంటి?
అదేంటి? ఎన్టీఆర్ ఒక్కసారిగా అలా మారిపోయాడేంటి?. అరవింద సమేత వీరరాఘవలో సిక్స్ ప్యాక్ తో అదరగొట్టిన ఈ హీరో..ఇప్పుడు ఎవరూ గుర్తుపట్టనంత లావు అయిపోయాడు. పాత్ర కోసం దేనికైనా రెడీ అనే ఎన్టీఆర్ ఈ సాహసం చేశాడా?. అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా కోసం ఎన్టీఆర్ ఈ రిస్క్ చేశాడని చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ సాగుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్, చరణ్‌లపై భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ వంద కేజీలకుపైగా బరువు పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.